NTV Telugu Site icon

Ram Navami Shobha Yatra: హైదరాబాద్‌లో శ్రీరామనవిమి శోభాయాత్ర.. పూర్తి వివరాలు ఇవే..

Ramnavami1

Ramnavami1

ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

READ MORE:MS Dhoni Retirement: చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు.. రిటైర్మెంట్‌పై ఊహాగానాలు!

శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.

READ MORE: CM Revanth Reddy: తొలిసారి సీఎం హోదాలో భద్రాద్రికి సీఎం రేవంత్‌రెడ్డి.. ముత్యాల తలంబ్రాల సమర్పణ..