Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలేలో జారుతున్న మొదటి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 68 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 68 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర 158 బంతుల్లో 91 పరుగులతో, అజాజ్ పటేల్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. నేడు (సెప్టెంబర్ 23)న ఐదవరోజును కొనసాగించగా న్యూజిలాండ్ కేవలం…