Site icon NTV Telugu

SL vs AFG: 241 పరుగులకు శ్రీలంక ఆలౌట్.. ఆఫ్ఘాన్ ముందు స్వల్ప లక్ష్యం

Sl Target

Sl Target

SL vs AFG: ప్రపంచకప్ 2023లో భాగంగా పూణే వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. బ్యాట్స్ మెన్లు ఎవరది అర్థసెంచరీ దాటలేదు. నిస్సాంకా 46, కరుణ రత్నే 15, కుషాల్ మెండీస్ 39, సమరవిక్రమ 36, అసలంక 22, డి సిల్వ 14, మ్యాథ్యూస్ 23, చమీర 1, తీక్షణ 29, రజిత 5 పరుగులు చేశారు.

Read Also: AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా.. ఎందుకంటే..?

ఇక ఆఫ్ఘాన్ బౌలర్లు ఈ మ్యాచ్ లో విజృంభించారు. పరుగులను కట్టడి చేస్తూ.. వికెట్లను కూడా సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ లో ఫజల్హక్ ఫారూఖీ 4 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత ముజీబ్ రహమన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు. ఇప్పుడు ఆఫ్ఘాన్ ముందు 242 స్వల్ప విజయలక్ష్యం ఉంది.

Read Also: World Cup 2023: ఆఫ్ఘాన్- శ్రీలంక మ్యాచ్.. జాతీయగీతాలాపన సమయంలో అపశృతి

Exit mobile version