Asia Cup 2023: ఆసియా కప్ 2023 ముందు ఊహించని షాక్.. కరోనా వైరస్ బారిన పడిన ఇద్దరు స్టార్ ప్లేయర్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Sri Lankan Cricketers tested positive for Coronavirus ahead of Asia Cup 2023 ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ మొదలయింది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఉండగా.. శ్రీలంకలో 9, పాక్‌లో 4 జరగనున్నాయి.
అయితే ఆసియా కప్ 2023 ఆరంభానికి ఐదు రోజులు ముందు ఊహించని షాక్. ఇద్దరు శ్రీలంక స్టార్ క్రికెటర్లు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారని సమాచారం. శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరా కరోనా బారిన పడ్డారట. ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆగస్ట్ 20న ముగిసిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ చివరి దశ సమయంలో ఫెర్నాండో, పెరెరా వైరస్ బారిన పడి ఉండవచ్చని సమాచారం.
Also Read
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరాలకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఆసియా కప్ 2023 కోసం శ్రీలంక జట్టును త్వరలో ప్రకటించనుంది. అవిష్క ఫెర్నాండో, కుసల్ పెరెరా జట్టుకు ఎంపికయ్యారట. అయితే వారి లభ్యత కరోనా నుంచి కోలుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఇద్దరు అగ్రశ్రేణి శ్రీలంక క్రికెటర్లు పాజిటివ్‌గా తేలడం టోర్నీకి శుభసంకేతం కాదనే చెప్పాలి.
ఏడాది ప్రారంభం నుంచి వన్డేలు ఆడని అవిష్క ఫెర్నాండో ఇటీవల ముగిసిన లంక ప్రీమర్ లీగ్‌లో నిలకడ ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్‌లలో 244 పరుగులు చేశాడు. మరోవైపు ఓపెనింగ్ బ్యాటర్ కుశాల్ పెరీరా గాయాలు మరియు ఫామ్ కారణంగా జనవరి 2021 నుంచి ఆడలేదు. చాలా కాలం తర్వాత అతను ఎల్‌పీఎల్ 2023 సీజన్‌లో ఆడాడు. 8 మ్యాచ్‌ల్లో 210 పరుగులు చేశాడు. దాంతో ఈ ఇద్దరు ఆసియా కప్ 2023లో కీలకంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!