SL vs WI: కెప్టెన్‌గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SL vs WI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లంక జట్టు 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సాంక 103 బంతుల్లో 79 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. కెప్టెన్ కుసాల్ మెండిస్ 62 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. ఆ తర్వాత చరిత్ అసలంక 45 పరుగులతో కీలక సహకారం అందించగా, చివర్లో జనిత్ లియనాగే 29 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి జట్టు స్కోరును 300 దాటించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్ తలో రెండు వికెట్లు తీశారు.
304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు జస్టిన్ గ్రీవ్స్ మంచి ఆరంభం అందించాడు. అతడు 38 బంతుల్లో 45 పరుగులు చేయగా, కెప్టెన్ షాయ్ హోప్ కూడా బాధ్యతాయుతంగా ఆడుతూ 66 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో వెస్టిండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కీసీ కార్టీ 27, రోస్టన్ చేజ్ 33, గుడకేష్ మోటి 22 పరుగులు చేసినా జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయారు. చివర్లో షమర్ జోసెఫ్ 23 పరుగులతో పోరాడినప్పటికీ వెస్టిండీస్ 49.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక విజయంలో పేసర్ దుశ్మంత చమీరా కీలక పాత్ర పోషించాడు. చమీరా 4 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటింగ్‌ను నేలకూల్చాడు. అతనితో పాటు స్పిన్నర్ మహీష్ తీక్షణ రెండు వికెట్లు తీయగా.. వనిందు హసరంగా, చరిత్ అసలంక తలో వికెట్ తీసి మ్యాచ్‌ను శ్రీలంక వైపు తిప్పేశారు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో 72 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించిన శ్రీలంక కెప్టెన్ కుసాల్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Also Read
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!