SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs RR: జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విన్నింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తూ SRH తమ బ్యాటింగ్ దూకుడును మరోసారి చూపించింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్థాన్బ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశి అద్భుత శతకంతో (103 పరుగులు, 37 బంతుల్లో) జట్టు భారీ స్కోర్ అందుకుంది. అతనికి తోడు ధ్రువ్ జురెల్ 51 పరుగులతో నిలకడగా ఆడగా, డోనోవన్ ఫెరెరా 33 పరుగులతో ఫినిషింగ్ ఇచ్చాడు. అయితే చివరి ఓవర్లలో ఆశించినంత వేగం అందుకోలేకపోవడంతో రాజస్థాన్ 228/6 చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ 2 వికెట్లు తీయగా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కీలక వికెట్ సాధించాడు. అలాగే కీలక సమయంలో నితీష్ రెడ్డి వికెట్ తీసి జోరుమీదున్న రాజస్థాన్ కు బ్రేకులు వేశాడు.
Also Read
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- 7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. అభిషేక్ శర్మ (57 పరుగులు, 29 బంతుల్లో) తన మార్క్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా, ఇషాన్ కిషన్ కేవలం 31 బంతుల్లో 74 పరుగులు చేసి మ్యాచ్‌ను SRH వైపుకు తిప్పేశాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్ కు 132 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.
ఇక రెండో వికెట్ గా వెనుతిరిగిన అభిషేక్ శర్మ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (29), నితీష్ కుమార్ రెడ్డి (36) కూడా వేగంగా పరుగులు సాధించి విజయం దగ్గరికి చేర్చారు. చివర్లో కేవలం 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి SRH సులభ విజయం అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసినా, మిగతా బౌలర్లు పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో SRH బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చూపించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 విజయాలతో 10 పాయింట్స్ +0.815 నెట్ రన్ రేట్ తో పాయింట్స్ పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది. దీనితో తమ ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలపరుచుకుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!