నేడు SRH vs LSG మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs LSG: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మూడో మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్.. రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. నేడు జరగబోయే మూడో మ్యాచ్‌లోనూ దుమ్మురేపేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో తమ సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్న కాటేరమ్మ కొడుకులైన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి నిన్న జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోల్‌కతా నుంచి నగరానికి చేరుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు నేరుగా ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి, శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఈ మ్యాచ్‌లో దుర్మురేపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. నిరాశాజనకమైన ఆరంభం తర్వాత ఎల్‌ఎస్‌జీ మరింత ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని బరిలోకి దిగుతోంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఆరంభంలో పాయింట్లు సాధించడం చాలా ముఖ్యం.
READ MORE: 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..
Also Read
ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ 200 ప్లస్ స్కోర్లు సాధించినప్పటికీ, రెండో మ్యాచ్‌లో ఓపెనర్లు ఇచ్చిన పునాది మిడిలార్డర్‌కు కలిసొచ్చింది. బౌలింగ్ విభాగంలోనూ గతంతో పోలిస్తే మెరుగైన నియంత్రణ కనిపించడం సానుకూలాంశంగా మారనుంది. మరోవైపు, లక్నో జట్టులో ప్రణాళికా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపడం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాదు.. మిడిలార్డర్‌పై ఒత్తిడి పెంచింది. కేవలం 141 పరుగులకే పరిమితమైన ఆ జట్టు, ఈ మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ ఆర్డర్‌ను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక హైదరాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామంగా చెబుతారు. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొంచెం సహకరించినా, ఆట సాగేకొద్దీ బ్యాటర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది.
READ MORE: Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’
చిన్న సరిహద్దులు, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌లో కూడా 220-230 పరుగుల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం విషయానికొస్తే, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ, మ్యాచ్ సమయంలో ఆకాశం నిర్మలంగానే ఉంటుందని అంచనా. జట్ల వివరాల్లోకి వెళ్తే.. సన్‌రైజర్స్‌కు బ్రైడన్ కార్స్ రాక అదనపు బలాన్ని ఇవ్వనుంది. అతను ఫిట్‌గా ఉంటే డేవిడ్ పేన్ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వేదికపై మంచి రికార్డు ఉన్న హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. లక్నో జట్టులో గాయాల బెడద లేకపోయినా, రిషబ్ పంత్ బ్యాటింగ్ స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో లక్నో 4-2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, హోమ్ గ్రౌండ్‌లో సన్‌రైజర్స్‌ను అడ్డుకోవడం వారికి సవాలుతో కూడుకున్న విషయమే.
ప్లెయింగ్ ఎలెవన్ అంచనాలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (c & wk), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్ / హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే / డేవిడ్ పేన్, ఈషాన్ మలింగ
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c & wk), ఐడెన్ మార్క్‌రామ్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, దిగ్వేష్ రాఠీ, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!