NTV Telugu Site icon

Abhishek Sharma: సిద్ధూ మూసేవాలాకు బిగ్ ఫ్యాన్ను.. నా ఆరాధ్యదైవం ఎవరో తెలుసా..?

Abishek

Abishek

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన యువ స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ కీలక విషయాలను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను బయటపెట్టాడు. తాను స్టార్ సింగర్ సిద్ధూ మూసేవాలాకు వీరాభిమానిని అని చెప్పాడు. నిజానికి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన ‘X’ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. అభిషేక్ శర్మ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అభిషేక్‌ క్రికెటర్‌గా మారకపోతే ఏ రంగాన్ని ఎంచుకుని ఉండేవాడని ప్రశ్నించారు. దీనిపై అభిషేక్ శర్మ స్పందిస్తూ.. తాను క్రికెటర్‌ని కాకపోతే వ్యాపారవేత్తను అయ్యేవాడినని తెలిపాడు.

Ayodhya Ram Mandir: భక్తులకు అలర్ట్.. 4 రోజులు రాంలల్లా దర్శనం, హారతి పాస్లు రద్దు

అంతేకాకుండా.. అభిషేక్‌కు ఇష్టమైన పాటల ప్లేలిస్ట్ గురించి ఒక ప్రశ్న అడగగా.. అతను సిద్ధూ మూసేవాలాకు బిగ్ ఫ్యాన్ అని చెప్పాడు. సిద్ధూ పాటలు అతనిని ఉత్సాహపరుస్తాయని అన్నాడు. అంతేకాకుండా.. అతను మొదటి నుండి యువరాజ్ సింగ్‌ను తన ఆదర్శంగా భావిస్తానని చెప్పాడు. 2007 ప్రపంచకప్‌లో యువరాజ్ ప్రదర్శనను చూసిన తర్వాత.. తాను ఈ క్రీడను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇక.. తనకు క్రికెట్ స్టేడియంలలో చిన్నస్వామితో పాటు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం ఇష్టమని అభిషేక్ శర్మ చెప్పాడు.

Meher Ramesh : మెగా ఫ్యాన్స్ ను భయపెడుతున్న మెహర్ అన్న..?

ఈ సీజన్ లో ఈ యువ బ్యాట్స్‌మెన్ తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించి రికార్డుకెక్కాడు. ఈ సీజన్ లో 5 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ.. 208.24 స్ట్రైక్ రేట్‌తో 177 పరుగులు చేశాడు.