SRH New Captain: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ఇతడే..
- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మార్పు..
- ఇషాన్ కిషన్‌కు పగ్గాలు..
- కమిన్స్ వచ్చే వరకు బాధ్యతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్-2026 సీజన్ రణరంగం మొదలవ్వకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) శిబిరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టును విజయపథంలో నడిపిస్తాడనుకున్న స్టార్ ప్లేయర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు వెన్నునొప్పి గాయంతో ఆయన ఈ సీజన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నారు. ఈ క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించిన మేనేజ్మెంట్, చివరకు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపింది.
ఆరెంజ్ ఆర్మీకి కొత్త బాస్..
మెగా వేలంలో భారీ ధరకు దక్కించుకున్న ఇషాన్ కిషన్‌పై ఉన్న నమ్మకంతో యాజమాన్యం అతడిని తాత్కాలిక కెప్టెన్‌గా ప్రకటించింది. కిషన్ దూకుడైన బ్యాటింగ్ శైలికి తోడు, వికెట్ల వెనుక ఉండి గేమ్ ప్లాన్ చేయగల సామర్థ్యం అతడికి ప్లస్ పాయింట్ కానుంది. కమిన్స్ పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించే వరకు ఇషాన్ కిషనే సన్‌రైజర్స్‌ను నడిపిస్తారు. కెప్టెన్సీ మార్పుతో పాటు వైస్ కెప్టెన్‌గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను నియమించడం మరో విశేషం. గత కొన్ని సీజన్లుగా ఎస్ఆర్హెచ్ తరపున అద్భుత ప్రదర్శన చేస్తున్న అభిషేక్, ఇషాన్ కిషన్‌కు చేదోడు వాదోడుగా ఉండనున్నారు. ఇద్దరు యువ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా జట్టులో కొత్త ఉత్సాహం నింపాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read;Kuldeep Wedding: జడేజా కాళ్లు మొక్కిన కుల్దిప్.. వీడియో వైరల్ !
కమిన్స్ పరిస్థితి ఏమిటి..?
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న పాట్ కమిన్స్, అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా అతను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కోలుకున్న వెంటనే అతను భారత్‌కు చేరుకుని జట్టులో చేరతారని.. అప్పటివరకు కోచ్ డేనియల్ వెట్టోరి ఆధ్వర్యంలో ఇషాన్ బృందం వ్యూహాలకు పదును పెడుతుందని సమాచారం.
Also Read:
Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల మొద్దు నిద్ర.. నగరంలో భారీగా కుళ్లిన మటన్, కెమికల్ పెరుగు, కల్తీ హలీం, అల్లం-వెల్లుల్లి పేస్ట్!
ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఆరెంజ్ ఆర్మీ ఏ మేరకు రాణిస్తుందో, తన కెప్టెన్సీ మార్కును ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుభవజ్ఞుడైన కమిన్స్ లేకపోవడం జట్టుకు లోటే అయినప్పటికీ, యువ జోడీ ఏ రకమైన మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!