బుల్లితెర రాములమ్మ గా పాపులారిటిని సొంతం చేసుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అదిరే పోజులిచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
బుల్లితెర టాప్ యాంకర్స్ లలో ఒకరుగా శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది.. ఇప్పుడు సరికొత్తగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది..
ఈమధ్య గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు..హాట్ గా రెడీ అవుతూ ఘాటు పోజులుస్తున్న శ్రీముఖి కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది..సూపర్ సింగర్’ రియాలిటీ షోకు కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ షో ఎండింగ్ వచ్చింది. త్వరలో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి… ఈ సందర్బంగా ఈ అమ్మడు బ్లూ లెహంగా, వోణీలో కనిపించి అందరిని మంత్రముగ్ధులను చేసింది.. ఫొటోలపై అభిమానులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి అభిమాని, ఇంటర్ విద్యార్థి క్రేజీగా కామెంట్ చేశారు. తన చిన్న కోరికను చెప్పాడు..అక్క మీ ఫొటోషూట్ బాగుంది. ఈ డ్రెస్ లో బాగున్నారు. నేను ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నాను. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పావా ప్లీజ్.. అంటూ కామెంట్ రాశాడు.. దీనిపై రాములమ్మ స్పందిస్తుందో లేదో చూడాలి..