Site icon NTV Telugu

Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల

Sreeleela

Sreeleela

యంగ్ హీరోయిన్ శ్రీ లీల టైం ఏమాత్రం బాగాలేదు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న ఏకైక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గతంలో కొంత భాగం జరిగింది. 2023లో షూటింగ్ మొదలైనప్పుడు శ్రీలీల కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ సినిమా పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read:Aadi Srinivas: కవిత కామెంట్స్‌తో కేసీఆర్ అసలు రంగు బయటపడింది…

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేస్తూ, ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తి చేశారు. ఓజి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా ఆయన డేట్స్ ఇచ్చారు. వచ్చే నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓజి సినిమా కొంత షూట్ చేసిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ వెళ్లి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి, ఆయన మళ్లీ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా కాబోతున్నారు.

Also Read:HariHara VeeraMallu: ఓజీ షూట్ అయ్యాక అర్ధరాత్రి వీరమల్లు డబ్బింగ్.. దటీజ్ పవన్ కళ్యాణ్

శ్రీలీల ఈ సినిమా కోసం వరుస డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అవైలబిలిటీ ప్రకారం ఆమెను డేట్స్ అడిగితే, ఆమె అందుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మధ్యనే శ్రీ లీల తన తొలి హిందీ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంది. మరోపక్క రవితేజతో మాస్ జాతర సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివర్లో ఉంది. అలాగే ఆమె చేతిలో లెనిన్ అనే మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె డేట్స్ ముందే అడగడంతో, ఆమె ఆ డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version