NTV Telugu Site icon

NTR 30: శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు ఫిక్స్ ?

New Project (9)

New Project (9)

Sreeleela : ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నదని టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమా ఎనౌన్స్ మెంట్ లేదు. కొరటాల సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్న ఎందుకనో ఇంకా అది ప్రారంభం కాలేదు. ఆచార్య ఫ్లాప్ కారణంగా కొరటాల ఎన్టీఆర్ కోసం అనుకున్న స్క్రిప్ట్ పై మళ్లీ రీవర్క్ చేస్తున్నారు. యూనివర్శల్ అప్పీల్ తీసుకురావడానికి కసరత్తులు జరుగుతున్నాయి. మరో వైపు క్యాస్టింగ్ సెలక్షన్ కూడా ఇంకా పూర్తిగా జరగలేదు. హీరోయిన్ ని కూడా ఖరారు చేయలేదనే మాట వినిపిస్తుంది.

Read Also:Ginna : జిన్నా సినిమా ప్రీ రిలీజ్ రేపే..

కాకాపోతే హీరోయిన్ గా బాలీవుడ్ భామల్ని తీసుకోవాలని ప్రయత్నించారు. రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక రష్మిక, కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు తెలిసింది. వీరిలో రష్మిక మందన హీరోయిన్ గా ఖరారైపోయింది అనే ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు తెరపైకి మరో యంగ్ హీరోయిన్ పేరు వచ్చింది. తారక్‎కు జోడీగా పెళ్లి సందడి ఫేం శ్రీలీలని ఖరారు చేశారనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చేతిలో ఏకంగా ఏడు సినిమాల వరకు ఉన్నాయి. ఇక రామ్, బోయపాటి సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్.

Read Also: Priya Warrior : ఆ హీరో అంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్

ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం శ్రీలీలని ఎంపిక చేశారనే మాట తెరపైకి రావడంతో ఈ బ్యూటీ క్రేజ్ పై అందరూ షాక్ అవుతున్నారు. కేవలం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి ఇన్ని వరుస అవకాశాలని ఎలా అందుకుంటుందంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమెకి ఇలా భారీ ఆఫర్స్ రావడం వెనుక రాఘవేంద్రరావు హస్తం ఉందనే మాట వినిపిస్తుంది. ఒక వేళ తారక్ కి జోడీగా నిజంగా శ్రీలీలకి అవకాశం వస్తే మాత్రం అది ఆమె కెరియర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Show comments