Site icon NTV Telugu

sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!

Sreelela

Sreelela

నటి శ్రీలీల తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా తన తల్లి గురించి ఎమోషనల్‌గా రాస్తూ.. “హ్యాపీ బర్త్‌డే అమ్మ. నువ్వు నాకు 24/7 ఎంటర్‌టైన్‌మెంట్.. 365 రోజులూ నాకు ఎమోషనల్ సపోర్ట్. నిస్వార్థమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నిన్ను చూసే నేర్చుకున్నాను. నువ్వు నాకు ధైర్యంగా ఉండటం నేర్పిస్తే, నేను నీకు సమస్యలను తెలివిగా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ లోకానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ విష్ చేసింది. ఈ పోస్ట్‌లో తన తల్లి చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా శ్రీలీల షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

Also Read : Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?

కేవలం పర్సనల్ లైఫ్ లోనే కాదు, కెరీర్ పరంగా కూడా శ్రీలీల ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘D55’ (రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో) లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించి ధనుష్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు, బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ద్వారా శ్రీలీల హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతోంది. ఇలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Exit mobile version