NTV Telugu Site icon

Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్‌’లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. వీడియో వైరల్

Sqad Game

Sqad Game

Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్‌” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్‌ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్‌ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్ మొదటి వారంలోనే 68 మిలియన్ల వ్యూస్ సంపాదించి, ఏకంగా 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి . భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Also Read: Mumbai Indians IPL 2025: కొత్త ఫీల్డింగ్ కోచ్‌ని ప్రకటించిన ముంబై ఇండియన్స్

ఇదిలా ఉండగా, స్క్విడ్ గేమ్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తెలుగు, మళియాల, తమిళ హీరోలైన చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్‌ నటులు కూడా స్క్విడ్ గేమ్‌ పాత్రల తరహాలో కనిపిస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో రూపొందించబడింది. ఇందులో, ప్రముఖ నటులను స్క్విడ్ గేమ్‌లో భాగమైన పాత్రల మాదిరిగా డిజైన్ చేశారు. ఈ వీడియోను చూసిన కొందరు సోషల్ మీడియా నెటిజన్స్ ఒకవేళ హీరోలందరూ ఇలా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ‘స్క్విడ్ గేమ్‌’ లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందనే అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Also Read: KTR : నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు

ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అబుతుంది. అభిమానులు తమ హీరోలను స్క్విడ్ గేమ్‌లో చూస్తూ ఆ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. కొందరు అభిమానులు, తమ హీరోలు స్క్విడ్ గేమ్‌లో కనిపించడం బాగానే ఉంది కానీ.. ఓడిపోతే జరిగేది తలుచుకుంటేనే భయంగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు భారతీయ హీరోలు స్క్విడ్ గేమ్‌లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించడానికి ఇదొక మంచి ప్రయత్నమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.