Sportstar Sports Conclave: రేపే హైదరాబాద్‌లో ‘స్పోర్ట్‌స్టార్ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్’.. ముఖ్య అతిథులు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sportstar Sports Conclave in Telangana State on August 31: భారతీయ క్రీడా పత్రిక ‘స్పోర్ట్‌స్టార్’ దేశవ్యాప్తంగా ప్రాంతీయ క్రీడా సమ్మేళనాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. భారతదేశంలో క్రీడా విప్లవాన్ని వేగవంతం చేయడానికి ప్రతి రాష్ట్రంలోని క్రీడలకు సంబందించిన వ్యక్తులతో ‘స్పోర్ట్స్ కాన్‌క్లేవ్’ నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు ఎలా ఉపయోగపడాలో అనే సూచనలు ఇస్తారు. ఈ క్రమంలో ‘స్పోర్ట్స్ కాన్‌క్లేవ్’ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరగనుంది.
స్పోర్ట్‌స్టార్ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ తెలంగాణ రాష్ట్రంలో గురువారం జరగనుంది. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ జరగనుంది. అతిథులకు ఉదయం 10.45 నిమిషాల నుంచి లోపలికి అనుమతి ఉంటుంది. తెలంగాణ క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి శ్రీనివాస్ గౌడ్, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, హైదరాబద్ మాజీ క్రికెటర్ సీవీ ఆనంద్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్, భారత మహిళా జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్, ఎచ్‌సీఏ అధికారులు సహా కొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Also Read

తాజావార్తలు
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్‌లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!