Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది మావా ఈ రచ్చ?
- స్పిరిట్ నుంచి సాలిడ్ అప్డేట్
- స్పిరిట్ సౌండ్ స్టోరీకి పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్
- విలన్‌గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit Movie Villain: ఎట్టకేలకు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ నుంచి సాలిడ్ అప్డేట్ రావడంతో రెబల్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. లేట్‌గా ఇచ్చిన సరే.. స్పిరిట్ సౌండ్ స్టోరీకి పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వస్తోంది. ఈ ఆడియో గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇస్తూ.. స్టార్ క్యాస్టింగ్ రివీల్ చేశాడు సందీప్. ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. హీరోయిన్గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విలన్‌గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో స్పిరిట్ విలన్ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్పిరిట్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. దీంతో ముందు నుంచి ఈ సినిమాలో విలన్‌గా కొరియన్ యాక్టర్ ‘డాన్ లీ’ నటించనున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ఇన్ స్టాగ్రామ్‌లో సలార్ పోస్టర్‌ను డాన్ లీ షేర్ చేయడంతో ఆయన స్పిరిట్‌లో నటిస్తున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. అక్కడి నుంచి ప్రభాస్ వర్సెస్ డాన్ లీ అన్నట్టుగా ఎన్నో ఎడిటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ భారీ కటౌట్స్ తలపడితే బాక్సాఫీస్ బద్దలవుతుందని ఫాన్స్, నెటిజెన్స్ వైరల్ చేశారు.
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
కట్ చేస్తే ఇప్పుడు విలన్‌గా స్టార్ క్యాస్టింగ్ పేరులో డాన్ లీ పేరు లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది మాకు ఆ విలనే కావాలన్నట్టు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. డాన్ లీ విలన్ అయితే ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుందని, ఇప్పటికైనా ఆయనను విలన్‌గా తీసుకోవాలని అంటున్నారు. అయితే స్పిరిట్ స్టార్ క్యాస్టింగ్ ఇక్కడితో అయిపోలేదు. సందీప్ ఏది చేసిన సంచలనమే కాబట్టి.. ఆయన మైండ్‌లో డాన్ లీ ఉండే ఉంటాడు. ప్రస్తుతానికైతే స్పిరిట్ విలన్ వివేక్ ఒబెరాయ్ మాత్రమే.
తాజావార్తలు
-
Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!