Emergency Landing: మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది (మొత్తం 167 మంది) ఉన్నారు. ప్రయాణం మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. దీంతో చెన్నై విమానాశ్రయం అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చింది.
Fake Babas Gang: దుండిగల్‌లో దొంగ బాబాల ముఠా.. మత్తుమందు చల్లి రూ. 8.5 లక్షలు స్వాహా..!
ఇక ఈ విషయమై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, స్పైస్‌జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం నాలుగు రోజుల క్రితమే.. పాట్నా వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన వెంటనే) సాంకేతిక లోపం కారణంగా తిరిగి ఢిల్లీకి మళ్లింది. అంతకుముందు ఆగస్టులో కూడా శ్రీనగర్‌లో స్పైస్‌జెట్ విమానం ఇలాంటి సాంకేతిక సమస్యతోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Shyamala: ‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’.. కొత్త సినిమా విడుదలైంది అంటూ శ్యామల సెటైర్లు..
వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలపై స్పైస్‌జెట్ సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేశీయంగా ఈ విమానయాన సంస్థ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరోసారి సంచలనం సృష్టించింది. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.