Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను కలిసి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ప్రోటోకాల్ సెక్రటరీ అర్విందర్‌సింగ్ ఆహ్వానపత్రికను అందించారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖను కూడా అందించామని వారు వెల్లడించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Read Also: High Temperatures: మండుతున్న ఎండలు.. తెలంగాణలో 47 డిగ్రీలకు పైనే..
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విపక్ష నేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్‌ను ఆహ్వానించామమన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉందని వచ్చి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు.
