NTV Telugu Site icon

Team India: ఎల్లుండి క్రికెట్ అభిమానులకు స్పెషల్ డే.. ఎందుకో తెలుసా..?

Team India

Team India

టీమిండియా మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే.. అది ఒకే రోజు, ఒకే సమయంలో టీమిండియా మ్యాచ్‌లు అంటే రచ్చ మాములుగా ఉండదు. ఒకవైపు పురుషుల జట్టు.. మరోవైపు మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా దుబాయ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్ కూడా అక్టోబర్ 9న జరుగనుంది.

Read Also: T20 World Cup: టీమిండియా ప్లేయర్‌కు ఐసీసీ షాక్.. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత

పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ లో విజయం సాధించగా.. మహిళల జట్టు కూడా పాకిస్థాన్‌తో ఆడి గెలుపొందింది. అలాగే.. సెమీస్ చేరాలంటే ఉమెన్స్ జట్టు తప్పగ గెలవాల్సిన పరిస్థితి. అందుకోసం మహిళల జట్టు గెలుపొందాలి. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 9న పురుషుల, మహిళల టీమ్ మ్యాచ్‌లు దాదాపు ఒకే సమయంలో ప్రారంభంకానున్నాయి. రాత్రి 7 గంటలకు పురుషుల మ్యాచ్ ఉండగా.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో భారత్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల మధ్య అరగంట మాత్రమే తేడా ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 9 భారతీయ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది.

Read Also: CM Revanth Reddy : మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్దతు ఇవ్వండి… కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ విన‌తి

టీమ్ ఇండియా అక్టోబర్ 9 షెడ్యూల్:
పురుషులు- భారత్ vs బంగ్లాదేశ్ 2వ T20, రాత్రి 7 గంటల నుండి
మహిళలు- భారత్ vs శ్రీలంక మహిళల టీ20 ప్రపంచకప్ 12వ మ్యాచ్, రాత్రి 7.30 గంటలకు

Show comments