Special Circus: వాటికన్ డికాస్టరీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో ఫ్రాన్సిస్ రోమ్‌లో జరిగే ప్రత్యేక సర్కస్ కు 2,000 మందికి పైగా ప్రజలను పోప్ ఆహ్వానించారు. రోనీ రోలర్ సర్కస్ కంపెనీ ప్రత్యేక సర్కస్ షోను ప్రదర్శించనుంది. ఆహ్వానించబడిన వారిలో ఉక్రెయిన్, సిరియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సూడాన్ నుండి శరణార్థ కుటుంబాలు ఉన్నాయి. రోమ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కొన్ని కుటుంబాలు, రోమన్ శివారు టోర్వియానికాలోని వీధుల్లో, వివిధ వసతి గృహాల్లో నివసిస్తున్న 150 కంటే ఎక్కువ మంది నిరాశ్రయులు ఆహ్వానితులుగా ఉన్నారు. వారితో పాటు మదర్ థెరిసా సిస్టర్స్ ఆఫ్ ఛారిటీతో సహా వాలంటీర్లు కూడా ఉంటారు.
Read Also: India Vs Australia Ist Test Live: స్పిన్ మాయాజాలం.. తొలిటెస్టులో భారత్ ఘన విజయం
ఒక ప్రకటనలో, పాపల్ అల్మోనర్ కార్డినల్ కొన్రాడ్ క్రేజెవ్స్కీ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు.. ఆశాజనకంగా ఉండటానికి, సహాయం అవసరమైన వారికి.. కొన్ని గంటల ప్రశాంతతను అందించే మార్గంగా సర్కస్ ఉంటుందని వివరించారు. పోప్ కళాకారులను కలుసుకున్నప్పుడు సర్కస్ ఎల్లప్పుడూ బాధలను దూరం చేసి సంతోషపరుస్తుందని కార్డినల్ వివరించాడు. గంటల కొద్ది శిక్షణ, సర్కస్ వెనుక త్యాగం ప్రతి ప్రదర్శనను విజయవంతం చేస్తాయి. పట్టుదల అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందని సర్కస్ ప్రదర్శకులు మనకు గుర్తుచేస్తున్నారని కార్డినల్ క్రాజెవ్స్కీ తెలిపారు.