NTV Telugu Site icon

Speaker Tammineni Sitaram: తొడగొట్టిన స్పీకర్ తమ్మినేని.. ఎందుకో తెలుసా?

Speaker 1

Speaker 1

తమ్మినేని సీతారాం.. సీఎం జగన్ కి వీరవిధేయుడు.. ఆయన మీద ఈగ వాలినా ఆయన సహించరు. ఏపీ స్పీకర్ గా ఉన్న సీతారాం ఇవాళ తనలోని మరో రూపం చూపించారు. శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలొ నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో తొడగొట్టారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సిఎం అవుతారంటూ మహిళలే భరోసా ఇస్తున్నారన్నారు‌. విభిన్నమయిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలలోకి వెళుతున్న సిఎం జగన్ పై ప్రజల్లో విశ్వాసం వెల్లివిరుస్తుందన్నారు.పెన్షన్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. గడప గడపకు వెళుతుంటే మహిళలు ఘనంగా స్వాగతం చెబుతున్నారన్నారు స్పీకర్ తమ్మినేని. ఆయన తొడగొట్టడం ఇప్సుడు హాట్ టాపిక్ అవుతోంది.

Read Also: China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు

ఏపీలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పథకాల గురించే మాట్లాడుతున్నారన్నారు స్పీకర్ తమ్మినేని. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ మోహన్ రెడ్డే అన్నారు. పథకాల గురించి విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామంటున్నారు జగన్. ఇప్పుడు స్పీకర్ తమ్మినేని కూడా అదే విషయం పునరుద్ఘాటిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జనం మళ్లీ జగన్ కే పట్టం కడతారంటున్నారు. పనిలో పనిగా విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. అయితే, స్పీకర్ అయి ఉండి తమ్మినేని ఇలా ప్రవర్తించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి

Read Also: China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు