Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Speaker Prasad Kumar Democracy Commitment Remarks On Brs

Speaker Gaddam Prasad : కేటీఆర్‌పై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఫైర్‌..

Published Date :December 11, 2024 , 11:07 pm
By Gogikar Sai Krishna
  • కేటీఆర్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండిపాటు
  • ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ఉన్నా
  • బీఆర్ఎస్ తనకు మద్దతు ఇచ్చి స్పీకర్ పదవిలోకి రావడానికి తోడ్పడింది : స్పీకర్ గడ్డం ప్రసాద్
Speaker Gaddam Prasad : కేటీఆర్‌పై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఫైర్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Speaker Gaddam Prasad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనకు మద్దతు ఇచ్చి స్పీకర్ పదవిలోకి రావడానికి తోడ్పడిందని గుర్తుచేశారు, కానీ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనపై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. ఇంకా బీఆర్ఎస్ తన విధానాన్ని మార్చుకోలేదని, ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని విమర్శించారు.

KTR : రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ..

హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో, సభా వ్యవహారాలపై సభ్యుల అవగాహన పెంపుదల లక్ష్యంగా సభ ప్రారంభోత్సవాన్ని ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మరియు ఇతరులు నిర్వహించారు. స్పీకర్ మాట్లాడుతూ, శాసనసభలో సభ్యులు చట్టాల రూపకల్పనతో పాటు వాటి అమలు తీరు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చించాలన్నారు. సభ సమావేశాలు ఎక్కువ రోజులు జరగాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

గత శాసనసభ సమావేశాల్లో సీనియర్ సభ్యుల ప్రసంగాలు నూతన సభ్యులకు స్ఫూర్తిగా ఉండేవని పేర్కొన్నారు. వాగ్ధాటితోపాటు సభా నిబంధనలపై అవగాహన ఉన్న సభ్యులు సభా నిర్వహణకు సహకరిస్తారని అభిప్రాయపడ్డారు. జీరో అవర్, ప్రశ్నావేళ, బడ్జెట్ ఆమోదం వంటి అంశాలపై సభ్యుల అవగాహనను పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు శాసనసభ సభ్యుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలకమని స్పీకర్ అభిప్రాయపడ్డారు.

Winter: చలికాలంలో స్లైకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలో..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Criticism
  • democracy
  • HYDERABAD News
  • Legislative Orientation
  • Speaker Prasad Kumar

తాజావార్తలు

  • SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ బౌలర్ వచ్చేశాడోచ్..!

  • 8th Pay Commission: గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్‌లో జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం.. బకాయిలు రూ.15 లక్షలు

  • Jeevan Reddy: ఫలించని చర్చలు.. 43 ఏళ్ల కాంగ్రెస్ రాజకీయ చరిత్రకు ఎండ్‌కార్డ్?

  • Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి సొంత డిఫెన్స్ సెక్రటరీని బాధ్యుడిని చేసిన ట్రంప్

  • IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions