Weather Update: సౌతిండియాకు ఐఎండీ గుడ్‌న్యూస్.. ఈ రాష్ట్రాలకు వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ భారత్‌కు కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని గుడ్‌న్యూస్ చెప్పింది. వేడి గాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందవచ్చని పేర్కొంది.
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత్‌లో భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయించిన దగ్గర నుంచి నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత, చెమటలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి: AP Jobs : ఏపీలో భారీగా ఉద్యోగాలు .. నెలకు రూ.70,000 జీతం..
మే 7 నుంచి దక్షిణ భారత్‌లో వేడిగాలుల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపింది. తూర్పు విదర్భ నుంచి తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. మరాఠ్వాడా మీదుగా తుఫాను ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పింది. ద్రోణి ప్రభావం కారణంగా హీట్‌వేవ్ పరిస్థితులు తగ్గుముఖం పడతాయని సోమవారం వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచే చల్లని వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. ఇక మే 10 వరకు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: iQoo Z9x 5G: బడ్జెట్ ఫోన్స్ లో అదిరిపోయే ఫీచర్లతో రానున్న ఐక్యూ Z9x 5జీ ఫోన్..
అలాగే రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో వేడి తీవ్రత తగ్గుతుందని చెప్పింది. మే 7 వరకు ఈశాన్య భారతదేశంలో కూడా ఉరుములు, గాలులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్సుందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ద్రోణి కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణ, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక మే 08 – 12 మధ్యకాలంలో కేరళ, మహే, లక్షద్వీప్‌ల మీదుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే తెలంగాణలో మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కొద్ది రోజులుగా వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలు.. తాజా వాతావరణంతో ఊపిరిపీల్చుకుంటున్నారు.
Daily Weather Briefing English (06.05.2024)
YouTube : https://t.co/o7de3aZaMz
Facebook : https://t.co/ung0ggsKiV#weatherupdate #heatwave #rainfallalert #thunderstorm@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/hADWdYHZuZ— India Meteorological Department (@Indiametdept) May 6, 2024
తాజావార్తలు
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి