Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వే యార్డులో అత్యాధునిక సాంకేతిక మార్పులు, ట్రాక్ల పునరుద్ధరణ , మౌలిక సదుపాయాల మెరుగుదల పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. రైళ్ల రాకపోకల్లో వేగాన్ని పెంచడంతో పాటు ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. అయితే.. ఈ పనుల నిర్వహణ కోసం ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆ మార్గంలో నడిచే పలు కీలక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఈ పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణించే ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా.. శాతవాహన ఎక్స్‌ప్రెస్.. మే 2 నుంచి 5 వరకు రద్దు చేయబడింది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ & గౌతమి ఎక్స్‌ప్రెస్.. ఈ రద్దీ రైళ్లు కూడా నిర్ణీత కాలంలో అందుబాటులో ఉండవు. ఇంటర్‌సిటీ సర్వీసులు.. గుంటూరు–సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు అయ్యింది. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ , డోర్నకల్ మార్గాల్లో నడిచే ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. విశాఖపట్నం–మహబూబ్‌నగర్, కాకినాడ–లింగంపల్లి మార్గాల్లో ప్రయాణించే రైళ్లపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
Also Read:Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.
వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. రైల్వే శాఖ ఈ కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను పైన పేర్కొన్న తేదీలకు అనుగుణంగా మార్చుకోవాలి. రైలు బయలుదేరే ముందు ఎన్‌టిఇఎస్ (NTES) యాప్ లేదా రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్టేటస్‌ను సరిచూసుకోవాలి.
రద్దయిన రైళ్లకు బదులుగా అందుబాటులో ఉన్న ఇతర రైళ్లు లేదా రోడ్డు రవాణా మార్గాలను పరిశీలించాలని అధికారులు కోరారు. రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించే క్రమంలో ఈ తాత్కాలిక ఇబ్బందులు తప్పవని.. ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. పనులు పూర్తయిన తర్వాత ఈ మార్గంలో రైళ్ల వేగం పెరగడమే కాకుండా.. సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!