Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్న ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, ఈ విమానాశ్రయాన్ని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రావాలని అధికారికంగా ఆహ్వానించారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కీలకం కానున్న నేపథ్యంలో ప్రధాని చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధాని కార్యాలయానికి ముఖ్యమంత్రి కొన్ని కీలక తేదీలను ప్రతిపాదించారు. ప్రధాని వెసులుబాటును బట్టి జూలై 5 లేదా 8వ తేదీలు.. ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఏదో ఒక రోజు ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన జీఎంఆర్ సంస్థకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30వ తేదీ నాటికి విమానాశ్రయానికి సంబంధించిన అన్ని ప్రధాన పనులు పూర్తి కావాలని గడువు విధించింది. రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఇతర సాంకేతిక పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఉత్తరాంధ్రకు ఊతం..
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక రంగంతో పాటు ఐటీ, ఫార్మా రంగాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్నందున.. విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా నిలవనుండటంతో.. అధికారులు , నిర్మాణ సంస్థ సమన్వయంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!