ICC World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. స్టార్ పేసర్ ఔట్! ఇక బ్యాటర్లకు పండగే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nortje Ruled Out Of ICC World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తునాయి. అయితే ఈసారైనా ప్రపంచకప్ అందుకుందాం అనుకున్న దక్షిణాఫ్రికాకు టోర్నీకి ముందే భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న అన్రిచ్.. కోలుకోవడానికి దాదాపు 2 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా అన్రిచ్ నోర్జ్ గాయపడ్డాడు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నోర్జేను దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్‌ఏ) జొహన్నస్‌బర్గ్‌కు పంపింది. ఈ దాంతో ఆసీస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. దాంతో ప్రపంచకప్‌లో నోర్జ్ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్టే. అయితే అతడు మెగా టోర్నీ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సీఎస్‌ఏ భావిస్తోంది.
Also Read
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
Also Read: Violent Tornado: టోర్నడో బీభత్సం.. 10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు!
ప్రపంచకప్ 2023కు ప్రకటించిన 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టులో అన్రిచ్ నోర్జే ఉన్నాడు. గాయంతో నోర్జే దూరమైతే దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు ప్రపంచకప్‌కి ఎంపికైన మరో పేసర్ సిసంద మగల మోకాలి గాయంతో భాదపడుతున్నాడు. అయితే మగల టోర్నీ ఆరంభానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సమాచారం. ఇక ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో ఆక్టోబర్ 7న ఢిల్లీలో తలపడనుంది.
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!