ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- సోనీ Xperia 10 VIII స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్స్‌తో విడుదల
- 6.1 అంగుళాల Full HD+ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- Qualcomm Snapdragon 6 Gen 3 5G ప్రాసెసర్
- IP65/IP68 రేటింగ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, NFC, Bluetooth 5.4 వంటి ఫీచర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony Xperia 10 VIII: ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) నుండి Xperia 10 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Sony Xperia 10 VIII పేరుతో వచ్చిన ఈ ఫోన్లో గత తరం మోడల్‌తో పోలిస్తే డిస్ప్లే బ్రైట్నెస్, ఆడియో, బ్యాటరీ లైఫ్, హార్డ్‌వేర్ షార్ట్‌కట్ కంట్రోల్స్ వంటి అంశాల్లో పలు అప్‌గ్రేడ్స్ అందించారు. రోజువారీ వినియోగం, యాక్సెసిబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
డిస్ప్లే & బ్రైట్నెస్:
ఈ కొత్త మొబైల్ లో 6.1 అంగుళాల Full HD+ OLED డిస్ప్లేను అందించారు. ఇది 2340 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గత తరం మోడల్‌తో పోలిస్తే కొత్త స్క్రీన్ సుమారు 50% ఎక్కువ బ్రైట్నెస్ను అందిస్తుంది. దీంతో ఎండలో బయట ఉన్నప్పుడు మ్యాప్స్ చూడటం, కంటెంట్ చదవడం వంటి పనులు మరింత సులభంగా ఉంటాయి. డిస్ప్లేలో యాంబియంట్ లైట్‌కు అనుగుణంగా కలర్, కాంట్రాస్ట్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే టెక్నాలజీని కూడా అందించారు. 10-bit టోనల్ గ్రేడేషన్, 97% DCI-P3 కలర్ గామట్, Triluminos డిస్ప్లే ఫర్ మొబైల్ టెక్నాలజీతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఉంది.
Also Read
- 8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
- Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
స్టీరియో స్పీకర్లు:
ఆడియో విభాగంలోనూ Xperia 10 VIIIలో అప్‌గ్రేడ్స్ చేశారు. ఫ్రంట్ ఫైరింగ్ స్టీరియో స్పీకర్లను రీట్యూన్ చేశారు. గత మోడల్‌తో పోలిస్తే మొత్తం సౌండ్ అవుట్‌పుట్ సుమారు 15% పెరిగింది. అలాగే బాస్ రెస్పాన్స్ 30% పైగా మెరుగుపడినట్లు సోనీ పేర్కొంది. మెరుగైన స్టీరియో సెపరేషన్, వాయిస్ క్లారిటీతో సినిమాలు, మ్యూజిక్, వీడియోలు వినేందుకు మెరుగైన ఆడియో అనుభూతిని అందించనుంది.
పేమెంట్ షార్ట్‌కట్:
రోజువారీ వినియోగాన్ని సులభతరం చేసేందుకు సోనీ కొత్త షార్ట్‌కట్‌ను కూడా తీసుకొచ్చింది. ఫోన్లోని పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేస్తే ‘Rewards & Pay’ మెనూ వెంటనే ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంపిక చేసిన పేమెంట్ మెథడ్స్, లాయల్టీ ప్రోగ్రామ్‌లను యాక్సెస్ చేయవచ్చు. దీంతో షాపింగ్ సమయంలో ఒక చేత్తోనే వేగంగా పేమెంట్ ఆప్షన్లను ఓపెన్ చేసుకోవచ్చు.
ప్రాసెసర్ & స్టోరేజ్:
మొబైల్ పనితీరు కోసం ఈ ఫోన్లో 6nm టెక్నాలజీపై తయారైన Qualcomm స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 5G ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU ఉంది. 8GB RAMతో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. microSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. నాలుగు ప్రధాన OS అప్‌గ్రేడ్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనున్నట్లు సోనీ తెలిపింది.
కెమెరా & బ్యాటరీ:
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను అందించారు. ఇందులో 1/1.56 అంగుళాల Exmor RS సెన్సార్, f/1.9 అపర్చర్, 84 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. Hybrid OIS/EIS సపోర్ట్ కూడా లభిస్తుంది. దీనికి జతగా 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇది 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు. ఈ కెమెరాలో f/2.0 అపర్చర్, 78 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
ఈ కొత్త మొబైల్ లో 5000mAh బ్యాటరీని మాత్రమే అందించారు. అయితే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాకప్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. 30W USB PD ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. Xperia అడాప్టివ్ ఛార్జింగ్, బ్యాటరీ కేర్, స్టామినా మోడ్ వంటి బ్యాటరీ మేనేజ్మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. సోనీ బ్యాటరీ మేనేజ్మెంట్ టెక్నాలజీ ద్వారా సాధారణ వినియోగంలో నాలుగేళ్ల వరకు బ్యాటరీ హెల్త్‌ను కాపాడేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

డిజైన్, ఇతర ఫీచర్లు:
Xperia 10 VIIIలో ట్రాన్స్లూసెంట్ డిజైన్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో మ్యాట్ క్లియర్ ఫినిష్‌తో కూడిన ట్రాన్స్పరెంట్ ప్యానెల్ ఉంటుంది. ఫ్రోజెన్ వైట్, ఫరోస్టెడ్ గ్రే, మిస్టి లిలక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP65/IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, NFC, Bluetooth 5.4, Wi-Fi, USB టైపు-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బరువు 168 గ్రాములు కాగా, మందం 8.3mmగా ఉంది. అలాగే ప్రత్యేకంగా “స్టైల్ కవర్”ను కొనుగోలు చేయవచ్చు. ఇది ఫోన్ డిజైన్‌కు సరిపోయే ట్రాన్స్లూసెంట్ బ్యాక్ప్లేట్తో పాటు పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ మోడ్లలో ఫోన్‌ను ఉంచుకునేందుకు డ్యూయల్-ఓరియంటేషన్ కిక్స్టాండ్ను కలిగి ఉంటుంది.

ధర:
Sony Xperia 10 VIII ధర యూరప్‌లో 599 యూరోలుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.66,850 అవుతుంది. UKలో ఈ ఫోన్ ధర 549 పౌండ్లు, అంటే సుమారు రూ.71,650గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూరప్, UK మార్కెట్లలో సెప్టెంబర్ మధ్య నుంచి చివరి వారంలో అందుబాటులోకి రానుంది.
Ready when you are, Xperia 10 VIII. From a fine design and brighter display under sunlight, to quick and easy shooting and immersive audio, enjoy 2 days of battery life and 4 years of healthy battery for the road ahead.https://t.co/mfL6D30Gih#SonyXperia #Xperia10VIII… pic.twitter.com/vSsUDygUSE
— Sony | Xperia (@sonyxperia) August 25, 2026
తాజావార్తలు
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?