Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
- తండ్రి అంత్యక్రియలు వీడియో కాల్లో చూసిన కుమార్తెలు..
- పదమూడో రోజు కర్మ కార్యక్రమాలకు కూడా గైర్హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonipat Viral Incident: ఇటీవల హర్యానా పానిపట్‌లో తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్లో చూసిన కూతురు సంఘటన వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. సొనిపట్లోని వృద్ధాశ్రమంలో నివసిస్తున్న శివచరణ్ దాస్ రతన్ గుప్తా ఇటీవల మరణించారు. ఆయన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరు కూడా దహన సంస్కారాలకు హాజరుకాలేదు. వీడియో కాల్ ద్వారా అంత్యక్రియల్ని చూశారు. ఆస్థికల నిమజ్జనం సమయంలో కూడా వాట్సాప్ కాల్ ద్వారా మాత్రమే సంప్రదించారు.
ఇప్పుడు, తండ్రి 13వ రోజు కర్మ కార్యక్రమాలకు కూడా కుమార్తెలు హాజరుకాలేదు. హిందూ సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సామాజిక సంస్థల ప్రతినిధులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. అయితే శివచరణ్ కుటుంబం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ముఖ్యంగా ముగ్గురు కుమార్తెలు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. కుమార్తెలను సంప్రదించినప్పటికీ వారు పదమూడో రోజు కార్యక్రమాలకు రావడానికి నిరాకరించారని తెలిపారు. అన్ని కార్యక్రమాలను వృద్ధాశ్రమ నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రజలు పూర్తి చేశారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
ఇదిలా ఉంటే, శివచరణ్ బతికే ఉన్నాడన్న విషయం ఆయన సోదరుడు మహేంద్ర గుప్తాకు కూడా పదేళ్ల పాటు తెలియదని సమాచారం. మహేంద్ర తన సోదరుడు నేపాల్ భూకంపంలో చనిపోయాడని భావిస్తూ వచ్చారు. సోషల్ మీడియా ద్వారా శివచరణ్ బతికే ఉన్న విషయం తెలసుకుని మహేంద్ర హరిద్వార్ వెళ్లారు. అక్కడే శివచరణ్ అస్థికలను నిమజ్జనం చేశారు.
తాజావార్తలు
-
Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
-
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
-
Thyroid Symptoms: ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడం సాధ్యమేనా?
-
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?