Sonia Gandhi: జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ లోక్‌సభ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిలకు ఈ కార్యక్రమం కోసం ఆహ్వానం వచ్చింది. ఇంతకు ముందు కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ దీనిపై సానకూలంగా ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే వేడుకకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం హాజరవుతారని చెప్పారు.
Read Also: Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?
రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి ఇండియా ప్రతిపక్ష కూటమితో సహా దాని మిత్రపక్షాలతో విస్తృత చర్చల తర్వాత ఉంటుందని పలు వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీపై, ఇండియా కూటమి మిత్రపక్షాలపై దాడి చేయడానికి బీజేపీకి మారణాయుధాన్ని ఇస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీయేతర రాజకీయ పార్టీలకు, ప్రత్యేకించి అధికార పార్టీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలకు ఆహ్వానాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. విపక్ష నాయకులు ఇప్పుడు ఏ నిర్ణయమైనా అనుకూల, నష్టాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం వల్ల అధికార బీజేపీకి మందుగుండులా సాయపడుతుందని పలువురు భావిస్తున్నారు.