India-China Clash: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న సరిహద్దు ఘర్షణలు.. విపక్షాలు వాకౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China Clash: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తోంది. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే, 1962లో జరిగిన చైనా యుద్ధంపై దివంగత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత్‌పై లోక్‌సభలో చర్చకు అనుమతించారని.. ఇండో-చైనా సరిహద్దు పరిస్థితిపై చర్చ జరగాలని కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. తాము భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తున్నామని, 1962లో, భారతదేశం-చైనా యుద్ధం జరిగినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ ఈ సభలో 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారని.. ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.
కాంగ్రెస్ నేత డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్పీకర్ సభా కార్యకలాపాలను కొనసాగిస్తున్నప్పుడు, కాంగ్రెస్, అలాగే టీఎంసీ నిరసనగా వాకౌట్ చేశాయి. భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించాయి. టీఎంసీ లోక్‌సభ సభ్యుడు సుదీప్ బంద్యోపాధ్యాయ కూడా సభలో చర్చకు డిమాండ్‌ను లేవనెత్తుతూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తున్నారని అన్నారు. అంతకుముందు వివిధ అంశాలపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
ఆరోజు సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, డీఎంకే సభ్యులు కొన్ని అంశాలను లేవనెత్తాలని భావించారు. సభ్యుల్లో ఒకరు “జస్టిస్ ఫర్ స్టాన్ స్వామి” అనే ప్రింట్ అవుట్‌ను ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల సమయం ముఖ్యమని, అది తమ కోసమేనని స్పీకర్ నిరసన వ్యక్తం చేసిన సభ్యులకు చెప్పారు. అయితే, వారు వివిధ సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే కొంత సేపటి తర్వాత కొందరు సభకు వచ్చారు.
India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్
ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై సమగ్ర చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో రాజ్యసభ నుంచి బుధవారం 17 విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. తొలుత సభ ప్రారంభం కాగానే డిసెంబర్ 9న భారత్, చైనా సేనల ముఖాముఖిపై సవివర చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. చర్చకు ప్రభుత్వం అనుమతించనందుకు నిరసనగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా సభ నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు లోక్‌సభలోనూ తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. సరిహద్దులో చైనా దురాక్రమణపై సమగ్ర చర్చ జరగాలని కోరుతున్నామని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు. సరిహద్దులో చైనా అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జిలు, నివాసాలపై రక్షణ మంత్రి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదాలు చేయడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!