కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. కని పెంచిన కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్క కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
READ MORE: Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టు హెచ్చరిక.. గాలులు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటన
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేశ్వర్ నగర్‌లో జరిగింది. నిందితుడు ప్రదీప్ దేవాంగన్ (45)ఈ- రిక్షా డ్రైవర్. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దేవాంగన్ రూ.800 పెట్టి ఓ కుక్కపిల్ల కొనాలనుకున్నాడు. దానికి రూ.200 తక్కువయ్యాయి. డబ్బులు ఇవ్వాలని తన తల్లి గణేషి(70)ని అడిగాడు. బాధితురాలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో దేవాంగన్ ఆమెను సుత్తితో బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన తన భార్య రామేశ్వరిపై కూడా దాడి చేశాడు.
READ MORE: Bhagavad Gita: “ప్రతి భారతీయుడికి గర్వకారణం”.. భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు
దేవాంగన్15 ఏళ్ల కుమారుడు ఈ ఘటనను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పొరుగువారికి దాడి గురించి తెలియజేశాడు. స్థానికులు అక్కడికి చేరుకోగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేషి మరణించింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
