NTV Telugu Site icon

Dead Body On Bicycle: సైకిల్‌పై 15 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు

Deadbody

Deadbody

Dead Body On Bicycle: తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శివగామి (65) మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. గత నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. కాకపోతే, ఈసారి ఆమె మరణం తరువాత కూడా అతని తల్లిని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల హృదయాలను కలిచివేసింది.

Also Read: Mamatha Kulakarni: మహా కుంభమేళా‌లో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..

శివగామి, తిరునల్వేలి జిల్లా నంగునేరి సమీపంలోని మీనావంకులం గ్రామానికి చెందిన మహిళా. ఆమె భర్త జెబామలై చాలా సంవత్సరాల క్రితం మరణించడంతో, శివగామి తన ముగ్గురు కుమారులతో జీవితాన్ని గడిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. అంతేకాదు, ఆమె చిన్న కుమారుడు బాలన్ కూడా స్వల్ప మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు.

Also Read: Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వ్యక్తి మృతి

అయితే, బాలన్ తన తల్లిని సైకిల్‌పై తీసుకెళ్లి చుట్టూ ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లడం అనేది అలవాటుగా మారిపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం శివగామి ఆరోగ్యం క్షీణించడంతో, బాలన్ ఆమెను తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేర్పించాడు. కానీ, గురువారం సాయంత్రం శివగామి మృతదేహాన్ని గుడ్డతో కట్టి తీసుకెళ్లుతున్న చూసిన వారు, ముండ్రడైపు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాలన్‌ను అదుపులోకి తీసుకొని శివగామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం దాన్ని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే, కొన్ని మీడియా వర్గాలు శివగామి ఆసుపత్రిలో చనిపోలేదని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రి హెడ్, డా. రేవతి, బాలన్‌పై తీవ్రమైన ఆరోపణలు మోపారు. ఆమె మాట్లాడుతూ.., ఆసుపత్రిలో శివగామి చనిపోలేదని.. బాలన్ తల్లి చికిత్సకు సహకరించలేదని తెలిపారు. సిబ్బందికి తెలియకుండా తన తల్లిని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాడని వివరించారు.