Somireddy ChandraMohan Reddy: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అడ్డగోలుగా సాగుతోంది.. పేదోళ్ల భూముల్లో టన్నుకు 30 రూపాయలు ఇచ్చి రూ. 1485 కి అమ్ముకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత అతిపెద్ద స్కామ్ లైన ఓబులాపురం ఐరన్ ఓర్.. మధుకోడా మైనింగ్ స్కామ్‌లు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పుడు చాలా కాలం తర్వాత మూడు సిలికా.. నాలుగు క్వాడ్జ్ స్కామ్ లు ఏపీలో జరుగుతున్నాయని విమర్శించారు. పోరాటాలకు ప్రసిద్ధి చెందిన నెల్లూరు.. ఇప్పుడు భారీ స్కామ్ లకు పుట్టినిల్లుగా వైఎస్ జగన్ మార్చారని.. అక్రమ మైనింగ్‌పై పోరాటాలు చేశాం, డీజీపీకి ఫిర్యాదులు చేశాం.. అయినా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Venkatesh : ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న వెంకీ.. బాబాయ్ హోటల్ లో సందడి..
టీడీపీ హయాంలో ఒక్క టన్నుకి వంద రూపాయలుగా ఉన్న టాక్స్ ను.. వైసీపీ హయాంలో 381 రూపాయలకు పెంచేశారని విమర్శించారు సోమిరెడ్డి.. నెల్లూరులో విజయసాయి రెడ్ది ఆధ్వర్యంలో మైన్స్ కుంభకోణం జరుగుతోందన్న ఆయన.. ప్రతి నెలా ఒకటో తేదీ వైఎస్ జగన్ కు కమీషన్ చేరుస్తున్నారు.. 3 కోట్ల టన్నులు.. రూ.4,455 కోట్లు విలువ చేసే ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఆరోపించారు. రూ. 1,035 కోట్లను పన్ను రూపేణా ప్రభుత్వానికి చెల్లించాలి.. ఒక్క ఎకరాలో 25 వేల టన్నులు మైనింగ్ చేస్తున్నారన్న ఆయన.. అధికారులు కమీషన్లు తీసుకుంటున్నారు.. మూడేళ్లలో రూ. 371 కోట్లను మైన్స్ మీద పెనాల్టీ వేశారని దుయ్యబట్టారు. రూ. 371 కోట్లు ఎందుకు పెనాల్టీ వేశారు.? ఎంత వసూలు చేశారు. వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు. దేశంలో నంబర్ వన్ క్వాలిటి కలిగిన ఖనిజాన్ని పరిశ్రమలకు తరలించేస్తున్నారు.. పేదోళ్ల భూముల్లో టన్నుకు 30 రూపాయలు ఇచ్చి రూ. 1485 కి అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో సెంట్రల్ విజిలెన్స్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నాం అన్నారు.
Read Also: Alla Ramakrishna Reddy: బ్రేకింగ్: వైసీపీకి గుడ్‌పై.. ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
ఇక, సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఊరు ప్రక్కన దోపిడీ జరుగుతోందన్నారు సోమిరెడ్డి.. డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలాజీ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం హయాంలో ఉన్న లీజు దారులకు తిరిగి మైన్స్ అప్పగించాలని డిమాండ్ చేశారు. హై కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సైతం ధిక్కరించిన అధికారులు, మంత్రి మీద కన్ టెప్ట్ ఆఫ్ కోర్టు క్రింద కేసు నమోదు చేయాలని సూచించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.