Site icon NTV Telugu

Somireddy: నెల్లూరులో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని సోమిరెడ్డి నిరసన

Somireddy

Somireddy

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో వైసీపీ నేత శ్యాం ప్రసాద్ రెడ్డి మైనింగ్ చేస్తున్నారని చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. రుస్తుం మైనింగ్ యజమాని అనుమతి లేకుండా ఆయన గనుల్లో వైసీపీ నేతలు మైనింగ్ చేయడం ఎంత వరకూ సబబని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Read Also: Marriage fraud: పీఎఓం ఆఫీసర్‌ని అంటూ ఆరు పెళ్లిళ్లు.. పాక్‌తో సంబంధాలు..

అయితే, రోజు నాలుగు కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మైనింగ్ ను అడ్డుకోవాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు మాత్రం స్పందించడం లేదు అంటూ ఆయన వాపోయారు. మైనింగ్ ను అడ్డుకునే వరకూ నిరసన కొనసాగిస్తానని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మైనింగ్ జరిగే ప్రాంతంలోనే రాత్రి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసనను కొనసాగిస్తున్నారు. ఆయనకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తుండడంతో వైసీపీ నేతలు దోపిడీకి తెర తీశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

Exit mobile version