NTV Telugu Site icon

Mamata banerjee: ఎన్డీఏపై మమత సంచలన వ్యాఖ్యలు

Mane

Mane

ఆదివారం మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. సాయంత్రం 7:15 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్షాలకు మినహా విదేశీయులను ఆహ్వానించారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోందని ఆరోపించారు. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదన్నారు.

ఇది కూడా చదవండి: Man Floating On Road: ఓయ్ బాసు.. అది సిమ్మింగ్ పూల్ కాదు.. రోడ్డు గుర్తుందా..

400 సీట్లు గెలుస్తామన్న వారు కనీస మెజార్టీ మార్క్‌ కూడా సాధించుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయని… ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు? అని మమత జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Annamalai: మోడీ కేబినెట్‌లోకి అన్నామలై..?

తాజా ఫలితాల్లో ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించింది. ఇక టీఎంసీ బెంగాల్‌లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. ఆదివారం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలా ఉంటే ఆదివారం జరగనున్న మోడీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఇండియా కూటమి నుంచి ఎవర్నీ ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. స్వదేశీయులను పక్కన పెట్టి విదేశీయులను ఆహ్వానించారని ఎద్దేవా చేశారు.