Mamata banerjee: ఎన్డీఏపై మమత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. సాయంత్రం 7:15 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్షాలకు మినహా విదేశీయులను ఆహ్వానించారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోందని ఆరోపించారు. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Man Floating On Road: ఓయ్ బాసు.. అది సిమ్మింగ్ పూల్ కాదు.. రోడ్డు గుర్తుందా..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
400 సీట్లు గెలుస్తామన్న వారు కనీస మెజార్టీ మార్క్ కూడా సాధించుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయని… ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు? అని మమత జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Annamalai: మోడీ కేబినెట్లోకి అన్నామలై..?
తాజా ఫలితాల్లో ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించింది. ఇక టీఎంసీ బెంగాల్లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. ఆదివారం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉంటే ఆదివారం జరగనున్న మోడీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఇండియా కూటమి నుంచి ఎవర్నీ ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. స్వదేశీయులను పక్కన పెట్టి విదేశీయులను ఆహ్వానించారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!