Road Accident: క్రూజర్, కంటైనర్ ఢీ.. నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: మహారాష్ట్ర సొలాపూర్ జిల్లాలోని పంఢరపూర్–మంగళవేధ మార్గంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవేధ సమీపంలో ఓ క్రూజర్ జీప్‌ను ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
100x జూమ్ నుంచి 6200mAh బ్యాటరీ వరకు.. స్మార్ట్ ధరలో ఫ్లాగ్షిప్ అనుభవం.. నేడే vivo X200T లాంచ్..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ముంబై–థానే ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సెలవుల సందర్భంగా యాత్రకు బయల్దేరారు. తుల్జాపూర్, అక్కలకోట ఆలయాల్లో దర్శనాల అనంతరం పంఢరపూర్ మీదుగా డోంబివళి (ముంబై)కి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా డోంబివళి నివాసులేనని సమాచారం. సోమవారం రాత్రి మంగళవేధ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన తీవ్రత ఎక్కువగా ఉండటంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మంగళవేధ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించారు. అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా పంఢరపూర్–మంగళవేధ రహదారిపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా అతివేగం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే పనిలో పోలీసులు ఉన్నారు.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!