NTV Telugu Site icon

Rs.500Note : రూ.500నోటుపై రాముడి ఫోటో.. జనవరి 22న రిలీజ్ ?

New Project (34)

New Project (34)

Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామనామ స్మరణలో మునిగిపోయారు. రామమందిర ప్రారంభోత్సవంలో.. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే ఓ సంచలన వార్త ఒకటి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్‌ను విడుదల చేయబోతుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును ఆర్‌బీఐ విడుదల చేయబోతుందని దాంట్లో పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముడి చిత్రం
సాధారణంగా రూ.500 నోటులో జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. అయోధ్యలోని శ్రీరాముడు, శ్రీరామ మందిరం చిత్రాలతో కూడిన రూ.500 నోటుపై వైరల్ అవుతుంది. ఎర్రకోట ఫోటో ఉన్న చోట అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఫోటో ఉంది. మహాత్మా గాంధీ ఫోటో ఉన్న చోట శ్రీరాముడి ఫోటో ఉంది.

Read Also:Pakistan : పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై ఇరాన్ వైమానిక దాడులు

RBI కొత్త సిరీస్ నోట్లను జారీ చేస్తుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్ రూ.500 నోట్లను విడుదల చేయడం గురించి ఎటువంటి సమాచారం తెరపైకి రాలేదు. శ్రీరాముడి చిత్రాలతో వైరల్ అవుతున్న రూ.500 నోటు నకిలీది. బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వనీ రాణా మాట్లాడుతూ కొత్త నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్‌బిఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు.