Sobhita Dhulipalla: లెక్కలు వేసుకుంటే ఇక్కడ రాణించలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలతో మెప్పించిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ చిత్రం ‘చీకటిలో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో శోభిత తన పాత్ర గురించి, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
Also Read : Ashika Ranganath : మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసిన బ్యూటీ ఆషిక రంగనాథ్..
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
శోభిత మాట్లాడుతూ.. ఇందులో తాను ‘సంధ్య’ అనే పాడ్కాస్టర్ పాత్రలో కనిపిస్తాను, సంధ్య చాలా ధైర్యవంతురాలు. తన నమ్మకం కోసం ఎవరు ఉన్నా లేకపోయినా నిలబడే అమ్మాయి. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక బలమైన ఎమోషనల్ జర్నీ. కష్టం వస్తే భయపడి వెనకడుగు వేయకుండా, ముందడుగు వేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సంధ్య పాత్ర ద్వారా చెప్పబోతున్నాం’ అని వివరించింది. ఈ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్ర ట్రైలర్ను నాగచైతన్య తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయడం పట్ల శోభిత సంతోషం వ్యక్తం చేసింది. ‘నాకు నచ్చిన పాత్రకు నేను వంద శాతం న్యాయం చేస్తాను, మిగతా ఫలితాన్ని ప్రేక్షకులే తేలుస్తారు. నా వాళ్ళని కూడా ‘సినిమా ఎలా ఉంది?’ అని అడిగి అభిప్రాయాలు తీసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అని చాలా ఓపెన్ గా చెప్పింది. అలాగే
సినిమా ఇండస్ట్రీలో తన జర్నీ గురించి మాట్లాడుతూ.. ‘నేను ముంబై వెళ్లి ఆడిషన్స్ ఇచ్చి నా ప్రయాణం మొదలు పెట్టాను. ఒక ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి, ఇక్కడ జెండా పాతాలి అని నేను ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు. ఒకవేళ ఇండస్ట్రీలో బేరాలు, లెక్కలు వేసుకుంటే నటిగా కొనసాగడం చాలా కష్టం. నేను చేసే ప్రతి పాత్ర నా మనసుకు నచ్చాలి. అనురాగ్ కశ్యప్, మణిరత్నం లాంటి గొప్ప దర్శకులతో పని చేసినందుకు చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని తెలిపింది. త్వరలోనే తన తమిళ సినిమా కూడా తెలుగులో విడుదల కానుందని ఆమె వెల్లడించింది.
తాజావార్తలు
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!