తెలుగు భామ శోభిత ధూళిపాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు భారీగా రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై వస్తున్న అలాంటి రూమర్స్ పై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చింది.వారు లండన్ వెకేషన్‌లో అలాగే మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరిపై డేటింగ్ గాసిప్స్ తెగ వచ్చాయి.తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ్ల తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో క్లారిటీ అయితే ఇచ్చింది.శోభిత మాట్లాడుతూ నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండాలని చెప్పుకొచ్చింది.. జీవితంలో ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి. మంచి మనసు అలాగే ఇతరుల పట్ల ఎంతో దయ కలిగి ఉండాలి. సింపుల్ గా ఎలాంటి హడావుడి లేకుండా ఉండాలి. నాలాగా ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం ఎంతో చిన్నది ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. నన్ను బాగా అర్థం చేసుకోవాలి. జీవితంలోని ప్రతిక్షణాన్ని కూడా ఆస్వాదించాలి.’ అని తన మనసులోని మాటలను ఆమె చెప్పుకొచ్చింది.
తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ ‘అలాంటి వార్తలు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేవు. ఎవరైనా నా వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తా. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి రోజు కూడా నేను కష్టపడుతున్నా అని చెప్పుకొచ్చింది.గూఢచారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది శోభిత. బాలీవుడ్‌లో కూడా ఆమె సినిమాలు చేసింది.తెలుగు మరియు హిందీలోనే కాకుండా మలయాళంలో కూడా సినిమాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ తనదైన నటనతో అలరించింది . మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా శోభిత నటించింది. ఆమె నటించిన ది నైట్ మేనేజర్-2 సినిమా విడుదల కాబోతుంది.