Site icon NTV Telugu

Snake Found In Plane: ఎయిరిండియా విమానంలో పాము కలకలం.. విచారణకు ఆదేశం

Snake Found In Plane

Snake Found In Plane

Snake Found In Plane: శనివారం దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బీ-737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకోగా.. కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ విచారణ జరుపుతోందని సీనియర్ అధికారి తెలిపారు. బీ737-800 విమానం కేరళలోని కాలికట్ నుంచి రాగా.. ప్రయాణికులను సురక్షితంగా దింపారు.

ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమాన సిబ్బంది కార్గో క్యాబిన్‌ను చెక్ చేస్తున్న సమయంలో అందులో పాము కనిపించింది. దీంతో వారు హడలిపోయారు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. దుబాయ్ విమానాశ్రయానికి చేరుకోగానే విమానం కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, విమానాశ్రయ అగ్నిమాపక సేవలకు కూడా సమాచారం అందించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి తెలిపారు.

Cyclone Mandous: తీవ్ర వాయుగుండంగా మారిన మాండూస్‌.. చెన్నైని వణికిస్తున్న వర్షాలు

మరోవైపు, క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిరిండియా తెలిపింది. బాధ్యతలు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇది గ్రౌండ్ హ్యాండ్లింగ్ లోపమని.. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.

Exit mobile version