Smriti Mandhana Wedding: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన నవంబర్ 20న వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలుసా.. నటుడు-గాయకుడు-దర్శకుడు-సంగీతకారుడు పలాష్ ముచ్చల్ అని కథనాలు వెల్లడించాయి. స్మృతి మంధానకు బాలీవుడ్ నటుల కంటే తక్కువ అభిమానుల ఫాలోయింగ్ ఏం లేదు. ఆమె అందాన్ని ప్రశంసించడంలో ప్రజలు ముందు ఉంటారు. అలాగే ఆమె టీమిండియా మహిళా జట్టులో అత్యంత ముఖ్యమైన క్రీడాకారిణులలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
READ ALSO: Bandi Sanjay Kumar: బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గం..
చాలా ఏళ్లుగా డేటింగ్లో వాళ్లిద్దరూ
స్మృతి మంధాన.. నటుడు-గాయకుడు-దర్శకుడు-సంగీతకారుడు పలాష్ ముచ్చల్‌తో డేటింగ్ చేస్తోందని చాలా కాలంగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇంతలో కొన్ని రోజుల క్రితం స్వయంగా పలాష్ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి మంధానను ఇండోర్ కోడలిగా చేస్తానని ప్రకటించారు. ఈ వార్త వచ్చిన తర్వాత స్మృతి అభిమానులు వారి పెళ్లి కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లి తేదీ, వివాహం ఎక్కడ జరగబోతుందో అనే కొన్ని అప్డేట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పలు నివేదికల ప్రకారం.. పలాష్ – స్మృతి వివాహం నవంబర్ 20న మహారాష్ట్రలోని సాంగ్లిలో జరుగుతుందని సమాచారం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇది.. స్మృతి మంధాన స్వస్థలం. అయితే పలాష్ – స్మృతి వివాహ తేదీ గురించి ఇంకా అధికారిక వివరాలు నుంచి ఎలాంటి ప్రకటన బయటికి రాలేదు. స్మృతి – పలాష్ 2019 నుంచి డేటింగ్లో ఉన్నారు. వాళ్లిద్దరూ ఐదేళ్ల రహస్యంగా డేటింగ్లో ఉన్న తర్వాత 2024 లో మొదటిసారి అధికారికంగా తెలియజేశారు. స్మృతి మంధాన ప్రస్తుతం ఓడిఐ మహిళల ప్రపంచ కప్‌లో బిజీగా ఉన్నారు.
పలాష్ ముచ్చల్ ఎవరో తెలుసా?
పలాష్ మే 22, 1995న ఒక మార్వారీ కుటుంబంలో జన్మించాడు. ఆయన.. ప్రముఖ గాయకురాలు పాలక్ ముచ్చల్ సోదరుడు. ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ గాయకుడు. తన సోదరిలాగే ఆయన కూడా అనేక పాటలను స్వరపరిచాడు, పాడాడు. అలాగే పలాష్ సినిమాల్లో నటన, దర్శకత్వంలో కూడా రాణించాడు. ఆయన రాజ్‌పాల్ యాదవ్-రుబీనా దిలైక్ నటించిన “అర్ధ్” చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పెందింది. పలాష్ తరచుగా తన సోదరి పలాక్తో కలిసి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తుంటాడు. బాలీవుడ్లో అతి పిన్న వయస్కుడైన సంగీత స్వరకర్తగా ప్రపంచ రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. 18 ఏళ్ల వయసులో ఆయన తన మొదటి పాటను కంపోజ్ చేశారు.
READ ALSO: Russia Poseidon Drone: ప్రపంచాన్ని కుదిపేసిన రష్యా.. సముద్రంలో మాస్కో డ్రోన్ సునామీ!