WPL 2023: ఆర్సీబీ కెప్టెన్‌గా మంధానా.. ప్రకటించిన కోహ్లీ, డుప్లెసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమెన్స్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ఐదు జట్లు పోటీపడుతుండగా ఇటీవలే ప్లేయర్ వేలం పూర్తయింది. ఈ మెగావేలంలో మంధానాను ఆర్సీబీ రూ 3.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. తాజాగా ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్‌తో మంధాన కెప్టెన్‌గా నియమితురాలైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మేనేజ్మెంట్. స్మృతికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
From one No. 18 to another, from one skipper to another, Virat Kohli and Faf du Plessis announce RCB’s captain for the Women’s Premier League – Smriti Mandhana. #PlayBold #WPL2023 #CaptainSmriti @mandhana_smriti pic.twitter.com/sqmKnJePPu
Also Read
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 18, 2023
ఇక, ఈ విషయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్ అని సంతోషం వ్యక్తం చేసింది. విరాట్, డుప్లెసిస్ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుందన్న స్మృతి.. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్మెంట్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది.
మంధానా రికార్డు
డబ్ల్యూపీఎల్ వేలం-2023లో స్మృతి కోసం 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆర్సీబీ. ఈ క్రమంలో తొలి విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా స్మృతి పేరు రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇటీవలే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 4 నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానుంది.
Also Read: Akhil Akkineni: ‘ఏజెంట్’ సైలెన్స్ ‘వయోలెన్స్’ని డిఫైన్ చేస్తుంది…
తాజావార్తలు
-
Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!