Mahashivratri 2026: నేడు ‘మహాశివరాత్రి’.. ‘శివలింగం’ ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రార్థం ఏంటో తెలుసా?
- నేడు 'మహాశివరాత్రి'
- లింగం అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు
- లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరమేశ్వర తత్వాన్ని అనేక రూపాల్లో భావించి ఆరాధించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. వేదాలు, ఆగమాలు, పురాణాలు సూచించిన విధానాల ద్వారా భగవంతుని చైతన్యాన్ని అనుభవించి అనుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వీకులు వివిధ ఆరాధనా పద్ధతులను రూపొందించారు. వాటిలో అత్యంత ప్రాచీనమైన, గౌరవనీయమైన ఆరాధనా విధానం ‘శివలింగారాధన’.
‘లింగం’ అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు ఉన్నాయి. సాధారణంగా స్థూల అర్థంలో లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం అని చెప్పవచ్చు. భగవంతుడు నిరాకార స్వరూపుడు. ఆయన్ను మన కళ్లతో నేరుగా దర్శించలేము. అందుకే మనస్సు కేంద్రీకరించేందుకు ఒక ప్రతీక రూపాన్ని మనం స్వీకరిస్తాం. ఆ ప్రతీక శిల రూపంలోనైనా, విగ్రహ రూపంలోనైనా, కలశం, పసుపు ముద్ద వంటి సూచిక రూపంలోనైనా ఉండవచ్చు.
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
శాస్త్రపద్ధతుల ప్రకారం.. ఆ ప్రతీకకు ప్రతిష్ఠ, ఆవాహన వంటి కర్మలు నిర్వహించి దైవసాన్నిధ్యాన్ని ఆహ్వానిస్తారు. అలా శాస్త్రోక్తంగా ఆరాధింపబడే ఆ బింబాన్నే లింగం అని పిలుస్తారు. అంటే శివలింగం అనేది కేవలం ఒక రాయి లేదా ఆకారం కాదు.. అది పరమాత్మ తత్వానికి సూచిక, సృష్టి మూలాన్ని సూచించే చిహ్నం. తాత్త్విక దృష్టిలో శివలింగం విశ్వ సృష్టి యొక్క ఆది తత్వాన్ని సూచిస్తుంది. అది ఆకార–నిరాకార సమన్వయానికి ప్రతీక. భక్తి, ధ్యానం, తపస్సు ద్వారా ఆ చిహ్నాన్ని ఆరాధించడం ద్వారా భక్తుడు పరమేశ్వర చైతన్యాన్ని అనుభవిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే శివలింగారాధనను సనాతన ధర్మంలో అత్యున్నత సాధనల్లో ఒకటిగా భావిస్తారు.
Also Read: IND vs PAK: నేడే భారత్, పాకిస్థాన్ పోరు.. హై ఓల్టేజ్ మ్యాచ్ జరగడం అనుమానమే!
ఫాల్గుణమాస కృష్ణపక్ష చతుర్ధశి రోజున మహాశివరాత్రి పండగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి రోజున శివుడు నిరాకర రూపం నుంచి సాకార రూపంలో ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు శివపార్వతుల కళ్యాణం జరిగిన పవిత్ర రాత్రి అని కూడా భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల.. ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శివలింగానికి ధాతుర, గంగా జలాన్ని సమర్పించడం వల్ల పుణ్యం వస్తుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే గ్రహాల దుష్ప్రభావాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. నేడు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!