NTV Telugu Site icon

Bihar Sampark Kranti : బీహార్ సంపర్క్ క్రాంతి రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు

Bihar Sampark Kranti

Bihar Sampark Kranti

బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో నుంచి ప్రయాణికుల అరుస్తూ. పరుగులు పెట్టారు. మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు. దీంతో స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. రైలు ప్లాట్‌ఫారమ్‌పై నుంచి కదలగానే ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన లోకోపైలెట్ వెంటనే రైలును నిలిపారు.

READ MORE: Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ..

స్టేషన్‌లో మోహరించిన ఆర్‌పీఎఫ్ మరియు జీఆర్పీ సిబ్బంది వెంటనే ప్రజలు దూకుతున్న రైలు బోగీ వద్దకు చేరుకున్నారు. అక్కడికక్కడే విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ ఒక్కసారిగా లీకైనట్లు గుర్తించారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే రైల్వే మెకానికల్ విభాగం కమిటీ అధికారులు స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. అంతా బాగానే ఉందని చూసి.. రైలును 10:30 గంటలకు ముజఫర్‌పూర్‌కు పంపారు.

READ MORE:YouTuber: నూతన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్ సంపాదనే ఎక్కువ..!

ఈ ఘటనకు సంబంధించి సమస్తిపూర్ రైల్వే డీఎస్పీ రోషన్ కుమార్ గుప్తా సమాచారం ప్రకారం.. రైలు నంబర్ 12565 దర్భంగా-న్యూ ఢిల్లీ బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఆదివారం 09:21 గంటలకు సమస్తిపూర్ స్టేషన్‌కు చేరుకుంది. సుమారు 09:45 గంటలకు.. రైలు బయలుదేరుతుండగా.. జనరల్ కోచ్ నంబర్ 205056/Cలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పైకి దూకారు. మంటలు చెలరేగాయని పుకార్లు రావడంతో కోచ్ నంబర్ 205056/సీని విచారించాం. ఇది జనరల్ కోచ్. కోచ్‌లో ఉంచిన మంటలను ఆర్పే యంత్రంపై ఓ ప్రయాణికుడు కూర్చున్నట్లు విచారణలో తేలింది. దీంతో అగ్నిమాపక యంత్రం లీక్ అయ్యింది. సిలిండర్ లో నింపిన డ్రై కెమికల్ పౌడర్ బయటకు రావడం మొదలైంది. ఆ పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయని ప్రయాణికులు ఆందోళన చెంది బయటకు దూకారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు.