SL vs IND: సీఎస్‌కే తరఫున ఆడాకే గుర్తింపు వచ్చింది.. శ్రీలంక పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- సీఎస్‌కే తరఫున ఆడాకే గుర్తింపు
- ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అదృష్టం
- అంతకు మించి నాకేం అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matheesha Pathirana Says Sharing the dressing room with MS Dhoni is very special: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడాకే తనకు గుర్తింపు వచ్చిందని శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన తెలిపారు. చెన్నై తరఫున ఆడటం దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా అని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టం అని పతిరన పేర్కొన్నాడు. యువ మలింగగా గుర్తింపు పొందిన పతిరన.. చెన్నై తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. అనతికాలంలోనే సీఎస్‌కే కీలక బౌలర్‌గా ఎదిగాడు. దీంతో అతడికి శ్రీలంక టీమ్‌లో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్ 2024లో పతిరన ఫర్వాలేదనిపించాడు.
భారత్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం మతీశా పతిరన సిద్దమవుతున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అండర్-19 తర్వాత ఏ జట్టులో కూడా నాకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడాక జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. చెన్నై తరఫున ఆడటం దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తా. సీఎస్‌కేలో ఆడకముందు వరకు నా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న తర్వాత.. చెన్నై ఆడిన ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నించా. ఆ తర్వాత గుర్తింపు లభించింది. నాలాంటి కుర్రాళ్లకు ధోనీతో పరిచయం చాలా ప్రత్యేకం’ అని పతిరన అన్నాడు.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Also Read: Telangana Budget 2024: త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ.. వరి సన్నాలకు రూ.500 బోనస్: డిప్యూటీ సీఎం
‘నా బౌలింగ్‌ను చూసి చాలా మంది డెత్ ఓవర్లలో అద్భుతంగా వేస్తున్నావని ప్రశంసించారు. కొత్త బంతితో పాటు మిడిల్ ఓవర్లలోనూ మెరుగైన బౌలర్‌గా మారాలి. కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలిగితే.. నాకే కాదు నేను ఆడే జట్టుకూ మంచి జరుగుతుంది. ఇందుకోసం తీవ్రంగా ఆలోచించట్లేదు. నిలకడగా ఒకేచోట బంతిని వేయడంపై దృష్టి సారిస్తా. సరైన లెంగ్త్‌తో పాటు స్వింగ్ రాబడితే చాలు. అంతకు మించి నాకేం అవసరం లేదు’ అని మతీశా పతిరన చెప్పాడు.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!