SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- ఇంగ్లండ్‌పై శ్రీలంక సంచలన విజయం
- 430 పరుగుల భారీ లక్ష్యాన్ని 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదన..
- బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SL vs ENG: రావల్పిండిలో జరిగిన పాకిస్థాన్ వన్డే ట్రై-సిరీస్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. 430 పరుగుల భారీ లక్ష్యాన్ని 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో శ్రీలంక అద్భుత విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ విశ్యానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 116 బంతుల్లోనే 202 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. బ్రూక్‌కు జో రూట్ 69 పరుగులతో, టామ్ బాంటన్ 50 పరుగులతో సహకరించారు. చివర్లో విల్ జాక్స్ కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 400+ పరుగులు చేయగలిగింది.
Also Read
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
- Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
430 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే అవిష్క ఫెర్నాండో, పవన్ రత్నాయకే ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అవిష్క 83 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తర్వాత పవన్ రత్నాయకే తన దూకుడును కొనసాగించాడు. 106 బంతుల్లో 130 పరుగులు చేసి శ్రీలంక ఛేజింగ్‌కు బలమైన పునాది వేశాడు. ఇక పవన్ రత్నాయకే ఔటైన తర్వాత దసున్ శనక ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. శనక ఔటైన తర్వాత కూడా శ్రీలంక బ్యాటర్లు ఒత్తిడిని ఎదుర్కొంటూ లక్ష్యం వైపు దూసుకెళ్లారు. చివర్లో జనిత్ లియానగే 27 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.
చివరి ఓవర్లలో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. చివరి ఓవర్లో లంక విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. మొదటి బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆ తర్వాతి రెండు బంతులతో లంక 2 వికెట్లు కోల్పవడంతో మ్యాచ్ పతాక స్థాయికి చేరుకుంది. దీనితో లంక 49.3 ఓవర్లకు శ్రీలంక 423/8తో నిలిచింది. అయితే ఆ తర్వాత బంతికి అసిత ఫెర్నాండో సింగిల్ తీశాడు. దానితో 2 బంతుల్లో 6 పరుగులు అవసరమైన సమయంలో జనిత్ లియానగే కళ్లు చెదిరే స్ట్రైట్ సిక్సర్ తో శ్రీలంకకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్ 2 వికెట్లు తీశాడు. జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఇంగ్లండ్ బౌలర్లు విఫలమయ్యారు.
తాజావార్తలు
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి