ఉసిరికాయతో పచ్చళ్లు, మురబ్బా తయారు చేస్తారు. ఆయుర్వేదంలో ఉసిరిని ఔషధంగా ఉపయోగిస్తారు. విటమిన్ ‘సి’ అధికంగా ఉండే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. అయితే ఉసిరికాయలానే దీనిలో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచింది. మనం ఉసిరిలో ఉండే గింజలను పనికి రానివని పడేస్తూ ఉంటాం.. అయితే, ఇవి మీ ముఖం యొక్క గ్లోను పెంచడంలో.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉసిరి గింజల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Himanta Biswa Sharma: అస్సాంలో రూ.22 వేల కోట్ల కుంభకోణం.. స్పందించిన సీఎం
మెరుగైన జీర్ణక్రియ:
ఉసిరి గింజలలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా.. వీటి గింజల్లో ఉండే భేదిమందు గుణాలు ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో.. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అందుకోసం గోరువెచ్చని నీటిలో ఉసిరికాయ పొడిని కలుపుకుని తాగాలి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఉసిరి గింజలలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తరచుగా అనారోగ్యం బారిన పడకుండా నిరోధిస్తాయి. ఉసిరికాయ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
మెరిసే చర్మం:
ఉసిరి మాత్రమే కాదు.. దాని గింజలతో తయారు చేసిన పొడి కూడా చర్మానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. ఉసిరి గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. ఇవి చర్మంపై వృద్ధాప్యం, ముడతల ప్రభావాలను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి. అంతేకాకుండా.. ముఖంపై మొటిమలను తొలగిస్తుంది. ఎండిన ఇండియన్ గూస్బెర్రీ గింజలను పొడి చేసి, కొబ్బరి నూనెలో కలిపి పేస్ట్ తయారు చేసుకుని మొటిమలు వచ్చే ప్రాంతాల్లో అప్లై చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
చర్మ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు:
చర్మ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఉసిరి గింజల పొడిని తీసుకోవడం ప్రయోజనకరం. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రింగ్ వార్మ్, స్కేబీస్, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఉసిరి గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. ఉసిరి గింజలతో చేసిన పొడిని ప్రతిరోజూ తాగాలి. అంతే కాకుండా.. కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని కలిపి చర్మానికి రాసుకుంటే మంచిది.
జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది:
ఉసిరి గింజలతో తయారు చేసిన పౌడర్.. జుట్టు పెరుగుదలను మెరుగుపరచడం ద్వారా జుట్టు రాలడం, బూడిదరంగు సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఉసిరి గింజల నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా.. ఆరోగ్యంగా మారుతుంది. అంతే కాకుండా ఉసిరి గింజల పొడిని నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.