స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో పెట్టింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట నేడు (మంగళవారం) పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది.
Read Also: Rakul Preet Singh: పొట్టి గౌనులో రకుల్ స్టన్నింగ్ లుక్.. టాప్ గ్లామర్ తో హీటేక్కిస్తున్న భామ..
అయితే, ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బంది పడొద్దనే సెక్షన్ 17ఏ చట్టం తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారన్నారు. వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్‌పీసీ కింద క్వాష్ చేయలేమని రోహత్గీ తెలిపారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను దర్యాప్తులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ వాదించారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయన్నారు.
Read Also: Leo: హైదరాబాదులో లియో ఈవెంట్.. విజయ్ వస్తాడా?
ఇక, చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌గా తమ వాదనలను వినిపించారు. చట్ట సవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ప్రస్తావించారు. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు సెక్షన్ 17ఏ ఉందన్నారు. సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే ఛాన్స్ ఉంటుందని హరీష్ సాల్వే పేర్కొన్నారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని.. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సాల్వే కోరారు.
Read Also: Imman: ఆ స్టార్ హీరో నన్ను మోసం చేశాడు.. సంగీత దర్శకుడు సంచలన ఆరోపణలు
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే, ఇరు పక్షాలు శుక్రవారం లిఖితపూర్వక వాదనలు ధర్మాసనానికి సమర్పించనున్నాయి. ఆ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది. ఆ రోజు ఏలాంటి నిర్ణయం రాకపోతే, దసరా సెలవుల తర్వాతనే నిర్ణయం ఉంటుంది.. తదుపరి వారం ఆసాంతం కోర్టుకు సెలవులు ఉండనున్నాయి. ఇక, అక్టోబర్ 30న తిరిగి సుప్రీంకోర్టు ప్రారంభం కానుంది.