Imman: ఆ స్టార్ హీరో నన్ను మోసం చేశాడు.. సంగీత దర్శకుడు సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imman Sensational Allegations on Shivakarthikeyan: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ఇప్పుడు మరో సారి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి విడాకుల వార్తలతో హాట్ టాపిక్ అయిన ఆయన ఇప్పుడు స్టార్ హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి హీరో శివకార్తికేయన్ – ఇమ్మాన్ కాంబోలో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అయితే, ఇటీవల పరిణామాలు కనుక చూస్తే వీరిద్దరి మధ్య విబేధాలు పెరుగుతున్నాయని అనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇమ్మాన్ తన నిశ్శబ్దాన్ని వీడి స్టార్ హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవిత కాలంలో శివకార్తికేయన్‌తో కలిసి పనిచేయడం మానుకుంటానని ఇమ్మాన్ ప్రకటించాడు. ఈ జీవిత కాలంలో శివకార్తికేయన్‌తో భవిష్యత్ లో పని చేస్తున్నాననే ఊహే చాలా భయంకరంగా ఉంది. ఇది లోతైన వ్యక్తిగత కారణాల నుండి తీసుకున్న నిర్ణయం, శివకార్తికేయన్ చేసిన తీవ్ర నమ్మక ద్రోహం నా జీవితాన్ని మార్చివేసింది” అని అంటూ ఇమ్మాన్ పేర్కొన్నారు కానీ అసలు ఏం జరిగింది? అనే వివరాలు మాత్రం ఇమ్మాన్ వెల్లడించలేదు.
Leo: బ్రేకింగ్: లియో రిలీజ్ 19నే.. నాగవంశీ కీలక ప్రకటన
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
నేను గట్టిగా చెప్పలేను, భవిష్యత్తులో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం కుదరదు. బహుశా వచ్చే జన్మలో నేను మ్యూజిక్ కంపోజర్‌ని, ఆయన యాక్టర్ అయితే అది జరిగే అవకాశం ఉంది. ఇది నేను చాలా జాగ్రత్తగా అలోచించి తీసుకున్న నిర్ణయం. ఆ ద్రోహం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది, దీని గురించి నేరుగా ఆయన్నే అడిగాను కానీ దానికి ఆయన సమాధానం చెప్పలేను’’ అని ఇమ్మాన్ అన్నారు. 2013లో శివకార్తికేయన్ హీరోగా విడుదలైన ‘వరుతపథ వాలిబర్ సంగం’ సినిమాకి ఇమ్మాన్ సంగీతం అందించారు. ‘ఉదక్ కలరు రిబ్బన్’తో పాటు సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. శివ కార్తికేయన్ నటించిన ‘రజినీమురుగన్’, ‘సీమరాజా’, ‘నమ్మ విధిత్ పిళ్లై’ వంటి చిత్రాలకు కూడా ఆయనే సంగీతం అందించారు. ఈ సినిమా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ‘సీమరాజా’ సినిమా తర్వాత శివకార్తికేయన్ – టి.ఇమాన్ కలయిక మళ్లీ జరగలేదు.
తాజావార్తలు
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!